TS: ఆడపిల్ల పుట్టిందని అత్తింట్లోకి కోడలిని అడుగుపెట్టనివ్వలేదు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. జమ్మికుంటకు చెందిన కిరణ్‌తో, ఇళ్లంతకుంటకు చెందిన స్పందనకు నాలుగేళ్ల కిందట వివాహం కాగా 11నెలల క్రితం వీరికి కూతురు పుట్టింది. అప్పటినుంచి స్పందనను పుట్టింటి నుంచి తీసుకెళ్లడానికి కిరణ్ రాలేదు. బాధితురాలే మెట్టింటికి రాగా, లోనికి రానివ్వకుండా భర్త, అత్తామామలు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల జోక్యంతో పెద్దలు పంచాయతీ పెట్టారు. పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.
Entertainment(Telugu) Social Media
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి