భీమ్లా నాయక్ మూవీలో డానియెల్ శేఖర్‌గా అభిమానుల మనసు దోచుకున్న రానా మరో పవర్ఫుల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. 2010లో శేఖర్ కమ్ముల- రానా కాంబోలో వచ్చిన లీడర్ మూవీ భారీ హిట్ సాధించిన విషయం విధితమే. అయితే ఆ మూవీకి సీక్వెల్‌ని శేఖర్ ప్లాన్ చేశాడట. ఇప్పటికే స్టోరీని రానాకు వినిపించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను వినోదాన్ని పంచనుంది.