భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ ఇక ముగిసినట్లేనని టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ‘‘ ఇటీవల ధావన్ ఓపెనర్‌గా వరుసగా విఫలమవుతున్నాడు. బంగ్లా పర్యటనలో మూడు వన్డేల్లో 7, 8, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో కొనసాగడం అనుమానమే. ప్రస్తుతం యంగ్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్లు అధ్భత ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు రోహిత్ శర్మను ఓపెనర్‌గా కాదనే పరిస్థితులు లేవు. ఇక ధావన్ కెరీర్ చరమాంకంలో పడ్డట్లే.’’ అంటూ కార్తీక్ పేర్కొన్నాడు.