తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి, తుపాను వణికిస్తున్నాయి. తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు ఈదరగాలులు వీస్తున్నాయి. సంగారెడ్డిలోని న్యాల్ కల్లో 6.6 డిగ్రీలకు ఉష్ణోగ్రత డిపోయింది. కామారెడ్డిలోని డోంగ్లీలో 6.8, ఆదిలాబాద్ పోచార 7, సొనాలలో 7.3 డిగ్రీలు ఉంది. మాండౌస్ తుపాను ఇవాళ పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ప్రభావం చూపనుంది.