విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షాక్ ఇచ్చింది. రూ.30 లక్షల భారీ జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన కేసులో ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను కూడా 3 నెలలపాటు రద్దు చేసింది. ఎయర్ ఇండియా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఫైన్ విధించినట్లు డీజీసీఏ పేర్కొంది. కాగా న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఓ వృద్ధురాలిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే.