టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పనితీరు సరిగా లేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. తక్కువ పనితీరు, తక్కువ ఉత్పాదకత, మంచి ఫలితాలు చూపించలేకపోవడం వంటి విభాగాలకు చెందిన వారిని తొలగిస్తున్నట్లు వివరించారు. కొంతకాలంగా గూగుల్లో ఉద్యోగాల కోత ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.