క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. సర్వీస్ ఛార్జీలు పెంచినట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ.99 ఉన్న ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ ఛార్జీలు ఇప్పుడు రూ.199కు పెరిగాయి. వీటికి జీఎస్టీ, ఇతర పన్నులు అదనంగా ఉన్నాయి. పెరిగిన ఛార్జీలు ఈ నెల 17 నుంచే అమల్లో ఉన్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్లకు గిఫ్ట్ కార్డుల రిడింప్షన్, రివార్డు పాయింట్ల రిడీమ్ నిబంధనలు కూడా పెరిగాయి. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.