మరో నాలుగు రోజుల్లో టాటా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సీజన్లో 10 టీంలు తలపడనున్నాయి. అయితే 2018 నుంచి ఐపీఎల్ ఆరంభ వేడుకలు నిర్వహించని బీసీసీఐ, ఈ సీజన్‌ను కూడా ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండా సీజన్ ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోందట. గత కొద్ది రోజులుగా చైనా సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.