జైపూర్ విమానాశ్రయంలో అధికారులు ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ను చెక్ చేశారు. ఆ ప్రయాణికుడు సాధారణ వ్యక్తి కాదు ఒడిషా IPS ఆఫీసర్. కానీ అతడు చేసిన పనికి అక్కడి చెకింగ్ అధికారులు ఒక్కసారి షాక్ అయ్యారు. ఏంటిది అని అనుకుంటూ నవ్వుకున్నారు. ఆ IPS ఆఫీసర్ పేరు అరుణ్ బొతారా. జైపూర్‌కు వెళ్లిన బొతారా అక్కడ పచ్చి బఠానీల ధర చాలా తక్కువ అని చాలా పెద్దమొత్తంలో కొనుగోలు చేశాడు. వాటిని తన లగేజీ బ్యాగులో తీసుకెళ్తుండగా.. ఎయిర్‌పోర్టు పోలీసుల తనిఖీల్లో విషయం బయటపడింది. ఈ విషయాన్ని అరుణ్ బొతారానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.