అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ‘ఏజెంట్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీని ఆగష్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ ఈ చిత్రం ఆగస్టులో విడుదలవడం కష్టమనే వార్త వినిపిస్తుంది. తాజాగా విడుదలైన మూవీ పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో.. దీనిపై వార్తలు ఊపందుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట.