సామాన్యులకు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న మిడిల్ క్లాస్ ప్రజలకు మరో మరో భారం నెత్తిమీద పడనుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చేయాల్సిన కనీస డిపాజిట్‌ను పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో అవసరాలకు వాడే 14.2కేజీల గ్యాస్ సీలిండర్కు కనీస డిపాజిట్ రూ.1,450 ఉండేది. ఇప్పుడు దానిని రూ.2,200కు పెంచాయి. దీంతో పాటు 5 కేజీల గ్యాస్ సీలిండర్ డిపాజిట్ ధర రూ.800 ఉండగా, దానిని రూ.1,150కు పెంచాయి. దీంతో సామాన్యుడు మరో భారం మోయాల్సిన పరిస్థితి వచ్చింది.