మెక్సికో నగరంలో దారుణం జరిగింది. ఉత్తరభాగంలో ఉన్న సియుడాడ్ జువరేజ్‌లో ఓ జైలుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇందులో 14 మంది మృతిచెందారు. దాదాపు 24 మంది ఖైదీలు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై మెక్సికో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.