సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ మల్టీస్టారర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. రజినీ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుబాస్కరన్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నాడు. క్రికెట్ ప్లేయర్ల మధ్య రగిలిన ఘర్షణ నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు పోస్టర్‌ను బట్టి స్పష్టమవుతోంది. హోలీ సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించారు.