అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. చైనీస్ లూనార్ న్యూఇయర్ వేడుకల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడ వేల మంది ఉన్నారు. మెషిన్ గన్తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. సమీపంలోని డాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.