తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తెస్తోంది. మొన్న చాయ్ తాగడం తగ్గించి దేశం ఆదాయం పెంచాలని కోరగా.. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కొత్త రూల్స్ పెట్టింది. రాత్రి 8 గంటలు దాటితే దుకాణాలు, మార్కెట్లను మూసివేయాలని ఆదేశించింది. దీంతో పాటు రాత్రి 10 దాటితే పెళ్లి వేడుకలు కూడా బంద్ చేయాలని సూచించింది. దీంతో విద్యుత్ ఆదా చేసుకోవచ్చని, దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కాగా ఆ దేశంలో పెట్రోల్, గ్యాస్ కష్టాలు కూడా అధికమవుతున్నాయి.