శరీరంపైకి దూసుకొచ్చే షార్ట్ బంతిని ఎదుర్కోవడంలో అక్షర్ పటేల్ తడబడతాడని దిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ చెప్పాడు. అయితే, ఏదైనా త్వరగా నేర్చుకోగలడని.. లోపాలను సవరించుకోవడంలో అక్షర్ ముందుంటాడని కొనియాడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అక్షర్ మెరిశాడు. మూడు హాఫ్ సెంచరీలు సహా 264 పరుగులు చేసి సిరీస్‌లోనే అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ‘షార్ట్ బంతిని ఎదుర్కోవడమే అక్షర్ సమస్య. అందుకే కొద్దిగా ఓపెన్ చేసి ఆడాలని సూచించాం. ఆఫ్‌సైడ్ షాట్లను మెరుగ్గా ఆడగలడు. అతడిలో ఎంతో నైపుణ్యం ఉంది’ అని పాంటింగ్ కొనియాడాడు.