హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. తెల్లవారుజాము నుంచే మబ్బులు పట్టి వాన పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాలానగర్, సుచిత్ర, వనస్థలీపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే నగరవాసులను కొద్దిరోజులుగా చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి వర్షం తోడవ్వటంతో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.