తమను ఎప్పుడూ స్టార్ హీరో భార్యగానే గుర్తించాలా అని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ ప్రశ్నించింది. ఒక షోకు అతిథిగా వచ్చిన మీరా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెలబ్రిటీ భార్య అనే భావన ఇప్పటికీ నచ్చదని పేర్కొంది. అదే స్టార్ హీరోయిన్ పెళ్లాడిన వ్యక్తిని స్టార్ భర్త అని ఎందుకు పిలవరని అడిగింది. ఒక మగాడి భార్యగానే ముద్ర వేయడం సరైనది కాదని అభిప్రాయపడింది. అలాగే స్టార్ కిడ్స్ లేబుల్‌పై కూడా ఘాటుగా స్పందించారు.