చంద్రబాబుతో భేటీపై పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..”కుప్పంలో జరిగిన సంఘటనపై చంద్రబాబును కలిశాను. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులను వైసీపీ కాలరాస్తోంది.. పెన్షన్లు తీసేయడం, రైతు సమస్యలపై చర్చించాం. ఫ్లెక్సీలు వాడొద్దంటారు, ఆయనకి మాత్రం ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. రూల్స్ అందరికీ వర్తిస్తాయంటారు, కానీ అమలు లేదు. లాఠీలు కూడా మేము పట్టుకోవాలా? వాళ్లే దాడులు చేసుకొని, వాళ్ల మంత్రుల ఇళ్లు తగలబెట్టుకునే సంస్కృతి వైసీపీది” అని పవన్ ఆరోపించారు.