నేడు కూడా టీమిండియాకు ఓటమి తప్పదా ?

© ANI Photo

నేడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం‌లో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా విజయోత్సాహంతో రెండో మ్యాచ్ కూడా విజయం సాధించాలని అనుకుంటుంది. అయితే నేటి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని అంచనా వేస్తే.. సౌతాఫ్రికాకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 2015లో ఈ స్టేడియం వేదికగా జరిగిన ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పైగా ఈ పిచ్ బౌలర్లకు సహకరించడంతో పాటు స్పిన్నర్లకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సౌతాఫ్రికా మళ్ళీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.

Exit mobile version