• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బౌలింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్

    శ్రేయస్ అయ్యర్ మనకు బ్యాటర్‌గా సుపరిచితం. అయితే, అతనిలో ఓ స్పిన్నర్ కూడా ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శ్రేయస్ అయ్యర్‌ బౌలింగ్ చేశాడు. తొలి రోజు టీ విరామానికి ముందు శ్రేయస్ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఇచ్చాడు. దీంతో అందరూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. లెగ్ స్పిన్నర్ అయిన శ్రేయస్ ఓవర్‌ను పొదుపుగానే వేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు, లంచ్ విరామం అనంతరం ఆసీస్ బ్యాటర్లు స్మిత్, ఖవాజా క్రీజులో పాతుకు పోయారు. ఇండియన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరు బోర్డును 149కి తీసుకొచ్చారు. స్కోరు: 149/2.