న్యూజిలాండ్‌తో రేపటి నుంచి జరగునున్న మూడు వన్డేల సీరిస్‌కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈమేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది. వెన్ను గాయం కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైనట్లు పేర్కొంది. అతడి స్థానంలో రాజత్ పటిదార్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. రేపు హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.