షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంపై టీమిండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ దృష్టి సారించాలని కివీస్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగులో అయ్యర్ దూకుడుగా ఆడతాడని డౌల్ చెప్పాడు. ‘స్పిన్ బౌలింగుపై అయ్యర్ ఎదురు దాడి చేయగలడు. కానీ, స్పిన్ బౌలింగులో కాస్త దూకుడు తగ్గించి ఆడితే నాకు నచ్చుతుంది. అయితే, పేస్ బౌలింగులో షార్ట్ బంతులను ఎదుర్కోవడంపై శ్రేయస్ దృష్టి సారించాలి. ఆ లోపాన్ని అయ్యర్ సరిచేసుకోవాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. కాగా, తొలి వన్డేలో శ్రేయస్ 80 పరుగులు చేశాడు.