కెరీర్ మొదట్లో వరుస విజయాలతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రియా సరన్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మలుపు తీసుకుంది. తరువాత ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తుంది. పాన్ ఇండియా చిత్రం RRRలో నటించిన శ్రియ, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘కబ్జా’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్ను మేకర్స్ విడుదల చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో సింహాసనంపైన మహారాణిలా శ్రియ కూర్చున్న తీరు ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.