కమల్ హాసన్ కూతురిగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. ఈ భామ ప్రస్తుతం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతాను హజారికాతో ప్రేమలో ఉంది. వీళ్ళిద్దరూ ముంబైలో సహజీవనం చేస్తున్నారు కూడా. దీంతో వీళ్లకు పెళ్లయింది అని అంతా అనుకున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు శృతిహాసన్ స్పందించలేదు. తాజాగా ఆమె ప్రియుడు శాంతను తమకు ఓ విధంగా పెళ్లి అయ్యిందని తెలిపాడు. అధికారికంగా పెళ్లి కానున్న తాము నిజమైన భార్య భర్తల్లా ఉంటున్నామని తెలిపాడు. తమ బంధం బలమైనది, ఇది ఇలానే కొనసాగుతుందని పేర్కొన్నాడు.