సూపర్‌ఫామ్‌లో చెలరేగుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 4 శతకాల మార్కును చేరుకున్న భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 21 ఇన్నింగ్స్‌లోనే గిల్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు శిఖర్ దావన్ (24 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును శుభ్‌మన్ గిల్ అధిగమించాడు. మొత్తంగా ఇమామ్ ఉల్ హక్ 9 ప్రథమ స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డి కాక్ 16, డెనిస్ అమిస్ 18 రెండు మూడో స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.