శుభ్‌మన్ గిల్ వన్డే కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అదరగొట్టాడు. 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీ ఇన్నింగ్సులో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉండటం విశేషం. ఓవరాల్‌గా గిల్‌కు కెరీర్లో ఇది మూడో సెంచరీ. టెస్టు ఫార్మాట్లో ఒక శతకం నమోదు చేశాడు. మరోవైపు, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో గిల్ ఆకట్టుకుంటున్నాడు. తొలి వన్డేలో గిల్ 70 పరుగులు చేశాడు.