3 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాల్లో గిల్ అగ్రస్థానానికి వెళ్లాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్.. మొత్తంగా ఈ సిరీస్‌లో 360 పరుగులు చేశాడు. 2016లో పాక్ క్రికెటర్ బాబర్ అజామ్ వెస్టిండీస్‌పై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా 360 పరుగులు చేశాడు. గిల్ ఆ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో గిల్, అజామ్ తర్వాత…ఇమ్రుల్ కైస్ 349, క్వింటన్ డి కాక్ 342, మార్టిన్ గప్టిల్ 330 ఉన్నారు.