టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డేలో శతకం బాదాడు. 87 బంతుల్లో మెరుపు సెంచరీ చేశాడు. శ్రీలంకతో సిరీస్‌లోనూ శతకం బాదిన గిల్ వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వన్డే కెరీర్లో శుభ్‌మన్‌కు ఇది ముడో శతకం. కేవలం 19 ఇన్నింగ్స్‌లో గిల్ మూడో శతకం చేశాడు. అంతకుముందు కేవలం శిఖర్ ధావన్ మాత్రమే అతి తక్కువ ఇన్నింగ్స్(17)లో మూడు శతకాలు చేశాడు.