‘డీజే టిల్లు 2’ క‌థ రాయ‌డంలో బిజీగా ఉన్న సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌

Courtesy Instagram: Siddhu Jonnalagadda

‘డీజే టిల్లు’ భారీ హిట్‌ను అందుకున్నాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. గ‌తంలో కొన్ని సినిమాలు చేసినా అంత‌గా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లుతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్నాడు. డీజే టిల్లు క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో రెండో భాగం కూడా తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌స్తుతం ఈ క‌థ రాయ‌డంలో బిజీగా ఉన్నాడ‌ట‌. డీజే టిట్లుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విమ‌ల్ కృష్ణ‌, పార్ట్ 2 కూడా ప‌నిచేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇక నేహా శెట్టి రాదిక క్యారెక్ట‌ర్‌ను ప‌క్క‌న పెట్టి , డీజే టిల్లు2 లో మ‌రో హీరోయిన్‌ను తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది.

Exit mobile version