మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో రీమేక్ కాకుండా, చిరు నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా చిత్రం షూటింగ్ సైలెంట్‌గా, శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే పలువురు స్టార్ తారాగణం, చిరంజీవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం.