జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్-300 సూపర్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన బుసానన్‌పై 21-8, 21-7ల తేడాతో వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. అటు కిదాంబి శ్రీకాంత్ సైతం ఫ్రాన్స్ ఆటగాడు బ్రైస్ లావెర్డ్పై 21-10, 13-21, 21-7ల తేడాతో గెలిచాడు. దీంతో సింధు, శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. అటు కె.సాయి ప్రతీక్, ఎన్.సిక్కి రెడ్డి జోడి ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమి చెందింది.