ఇండోనేషియా బాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు రాణిస్తున్నారు. టోర్నీలో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో సింధు ఇండోనేషియాకు చెందిన జార్జియా టున్జుంగ్పై విజయం సాధించింది. అటు లక్ష్యసేన్ కూడా డెన్మార్క్ ఆటగాడు రాస్మస్పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.