సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ సమంతకు వాయిస్ ఓవర్ ఇచ్చే ఈ అమ్మడు.. మహిళల సమస్యలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో తన DM బ్లాక్ అవడంతో కోపంతో చిన్మయి పోస్ట్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మర్మాంగాలను ఫోటో తీసి షేర్ చేస్తున్న వారిని బ్లాక్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ తనను సస్పెండ్ చేసిందని మండి పడింది. మీ కమ్యూనిటీ గైడ్లైన్స్కు సెల్యూట్ అంటూ స్టోరీ పోస్ట్ చేయడం వైరల్గా మారింది.