ఆహాలో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అయితే షోలో కంటెస్టెంట్స్ పాడిన పాటలకు చిరంజీవి ఫిదా అయ్యాడు. అందులో ప్రణతి అనే సింగర్‌కు నువ్వు భవిష్యత్తులో పెద్ద సింగర్వి అయిపోతావు. అందుకే ఇప్పుడు నాకు మొదటి ఆటోగ్రాఫ్ ఇవ్వు అంటూ చేయి చాపాడు. ఆమె మెగాస్టార్ చేతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది ప్రోమోలో హైలెట్‌గా నిలిచింది. మరి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో జూన్ 17న స్ట్రీమింగ్ కాబోతున్న ఫినాలే ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే.