ప్రముఖ సింగర్ కృష్ణకాంత్ కుమార్(53) హఠాన్మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని మిగిల్చింది. నిన్న కోల్కత్తా ఆడిటోరియంలో జరిగిన కాన్సర్ట్‌లో ఉత్సాహంగా పాల్గొన్న తర్వాత హోటల్లో చేరిన అతడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే పమరణించాడు. కేకేగా పాపులర్ అయిన ఈ సింగర్ 90లలో హిందీతో పాటు తెలుగు పాటలతోనూ అలరించాడు. సింగర్ ఆకస్మిక మృతికి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.