ప్రముఖ సింగర్ మంగ్లీ ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్ తెరకెక్కిస్తున్న ‘పాదరాయ’ మూవీలో మంగ్లీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శేఖర్ హీరోగా నటిస్తున్నాడు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తీయనున్నట్లు టాక్. కాగా మంగ్లీ తొలుత ఓ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత జానపద గీతాలు పాడి క్రేజ్ సంపాదించుకుంది. అడపాదడపా కొన్ని చిత్రాల్లో కనిపించింది.
-
Screengrab Instagram: iammangli -
Screengrab Instagram: