టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వద్ద ప్లాన్ బీ కూడా ఉంటుందని తెలిపాడు. అతడు బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడని తెలియజేశాడు. ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధమవతున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. అతడు ఆటగాళ్ల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాడని, కష్టమైన సవాల్ ఎదురైనప్పుడు తను ఆత్మస్థైర్యం నింపుతాడని అన్నాడు.