ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచులో హర్షల్ పటేల్ తో గొడవపై రియాన్ పరాగ్ స్పష్టతనిచ్చాడు. ‘గత సీజన్లో హర్షల్ నన్ను ఔట్ చేసినపుడు ఇక వెళ్లు అన్నట్టు చేయి ఊపాడు. ఈసారి చివరి ఓవర్ లో నేను అతని బౌలింగ్ లో కొట్టినపుడు నేనూ అదే చేశా’ అని పరాగ్ చెప్పాడు. అయితే గొడవ జరిగాక సిరాజ్ తనను దగ్గరికి పిలుచుకుని ‘నువ్ పిల్లాడివి పిల్లాడిలా ఉండు’ అని చెప్పాడని తెలిపాడు. హర్షల్ తో తాను ఎలాంటి వాగ్వాదానికి దిగలేదని పేర్కొన్నాడు.