• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెల్లి మరణించిన మూడు నిమిషాలకే అక్క మృతి

    శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనప గ్రామంలో విషాదం జరిగింది. చెల్లెలి ఊపిరి ఆగిన మూడు నిమిషాల వ్యవధిలోనే అక్క ప్రాణం విడిచింది. గ్రామానికి చెందిన మామిడి సన్యాసమ్మ కేన్సర్‌తో బాధపడుతున్నారు. వనపలో తమ ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఆమదాలవలస మండలం వంజంగిలో ఉండే ఆమె అక్క అనసూయమ్మ… తరచూ చెల్లిలి వద్దకు వచ్చి సపర్యలు చేస్తూ ఉండేవారు. శనివారం ఉదయం సన్యాసమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయారు. తన కళ్లముందే చెల్లి మరణించడంతో మనస్తాపానికి గురైన అనసూయమ్మ.. గుండెపోటుతో చనిపోయారు.