ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ నోటీసులను బేఖాతరు చేస్తే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. నిన్న కరీంనగర్ కు చెందిన ఓ కీలక నేత బంధువుకు నోటీసులు ఇచ్చారు. వీరిద్దరిని ఒకే సమయానికి విచారిస్తారని తెలుస్తోంది.
బీఎల్ సంతోశ్ కు సిట్ నోటీసులు

© ANI Photo