దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతా రామం’ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసినవారు వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. మూవీ ఒక క్లాసిక్ రొమాంటిక్ డ్రామా, దీనికి మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందని చెప్తున్నారు. సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా ఉంది. దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది. రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్‌తో పాటు ఇతర నటులు ఎంపిక బాగుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు అదిరిపోయిందని అంటున్నారు.