దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘సీతా రామం’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్ట్ 5న థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలిపింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తెలుగులో మొదటిసారిగా కనిపించబోతుంది. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.