ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఆరో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 36.33% ఓటింగ్ నమోదైంది. కాగా, ఆరో దశలో మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ లల్లు, ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వంటి కీలక నేతలు నేడు తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.