టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(SKY) మరో ఘనత సాధించాడు. 2022లో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ ఫీట్‌ని అందుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు పాక్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్(825) పేరిట ఉంది. గురువారం SKY రిజ్వాన్‌ని అధిగమించాడు. మరోవైపు, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్సులో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా తనదైన ఆటతీరుతో పరుగులు సాధించడం SKY సొంతం.
మరో రికార్డు సాధించిన SKY

© ANI Photo(file)