‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. అయితే, చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ ఫెయిల్యూర్ని ఇంకా మరచిపోలేనట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు పరోక్షంగా కొరటాల శివను విమర్శించారు. ‘డైరెక్టర్ బాబీ అన్ని సూచనలను స్వీకరించారు. నా అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకుని తగు మార్పులు చేశారు. కానీ, కొందరు వీటిని స్వీకరించరు’ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ పరోక్షంగా శివను ఉద్దేశించే చేసినట్లు చర్చించుకుంటున్నారు. ‘ఆచార్య’ సమయంలో చిరు చేసిన సూచనలను శివ స్వీకరించలేదని టాక్.