ఏపీలో బోరు బావులున్న రైతులకు షాకింగ్ న్యూస్. ఇంకో రెండు, మూడు నెలల్లో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టనున్నట్లు తెలుస్తుంది. అనేక మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం మీటర్లు అమర్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ రంగాన్ని మీటర్ లెక్కింపులో ఉంచిన ఏపీ.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలవనుంది. మీటర్ల బిగింపు తర్వాత కూడా వ్యవసాయ రంగానికి 9 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత కాలం ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.