ఆంధ్రప్రదేశ్ లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రక్రియను డిస్కంలు వేగవంతం చేశాయి. రూ. 2,210 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాయి. నెలకు 300 యూనిట్లు దాటిన వాటికి మెుదటిదశలో ఏర్పాటు చేయనున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంటుపోను రూ. 1850 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ మెుత్తాన్ని రుణంగా తీసుకోనేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 27.68 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టనున్నారు.