దిగ్గజ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మృతి వనం నిర్మించనుంది. మొగల్తూరు సమీప సముద్రతీరంలో రెండెకరాల స్థలం కేటాయించి స్మృతి వనం నిర్మిస్తామని ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రకటించారు. నిన్న జరిగిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్యామలాదేవిని, ప్రభాస్‌ను పరామర్శించారు.
కృష్ణం రాజు పేరిట స్మృతివనం

Courtesy Twitter: Roja