ట్విట్టర్ కొనుగోలుపై భిన్నవాదనలు

© File Photo

ప్రముఖ బిజినెస్‌మెన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ డీల్‌పై పరిశ్రమ వర్గాలు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు వివిధ రీతుల్లో స్పందిస్తున్నారు. ట్విట్టర్ కన్నా లేటుగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన మస్క్ కంపెనీ టెస్లా షేరు ధర ట్విట్టర్ కన్నా చాలా ఎక్కువ. ప్రస్తుతం ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాడు. కాబట్టి ట్విట్టర్ షేర్ ధర కూడా పెరుగుతుందని ఇన్వెస్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ సీఈవో అయిన పరాగ్ అగర్వాల్ మాత్రం ఈ డీల్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగుల పరిస్థితి, ట్విట్టర్ పరిస్థితి ఎలా ఉంటుందో అని అన్నారు.

Exit mobile version